తెలుగు సినీ పరిశ్రమకు వేల కోట్ల నష్టాన్ని కలిగిస్తున్న ఐబొమ్మ పైరసీ వెబ్సైట్ ఇప్పుడు హైదరాబాద్ పోలీసులకే సవాల్ విసిరింది. పైరసీపై హెచ్చరించిన పోలీసులకు, ఐబొమ్మ నిర్వాహకులు ప్రతి బెదిరింపు లేఖ విడుదల చేశారు. తమ వెబ్సైట్ను బ్లాక్ చేస్తే పోలీసుల సమాచారం బయటపెడతామని, ఐదు కోట్ల యూజర్ల డేటా తమ వద్ద ఉందని హెచ్చరించారు.