హైదరాబాద్‌లో 200 కోట్ల రూపాయలతో కొత్వాల్ గూడలో 35 ఎకరాల్లో కృత్రిమ బీచ్ నిర్మించబోతున్నారు. డిసెంబర్లో ప్రారంభించే ఈ ప్రాజెక్ట్‌లో ఫ్లోటింగ్ విల్లాస్, లగ్జరీ హోటళ్లు, వేవ్ పూల్స్, ఫుడ్ కోర్ట్, థియేటర్లు ఉంటాయి. హైదరాబాద్ పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేయడానికి ఈ ప్రాజెక్ట్‌ను ప్రభుత్వం ప్రైవేటు భాగస్వామ్యంతో చేపట్టింది.