హైదరాబాద్‌లోని చంద్రాయనగుట్ట నుంచి ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన విద్యావతి అనే మహిళ తన బ్యాగ్‌ను మర్చిపోయింది. ఆ బ్యాగ్‌లో 10 తులాల బంగారం ఉండటంతో ఆమె ఆందోళన చెందారు. కానీ, చంద్రాయనగుట్ట పోలీసులు బస్సును ట్రాక్ చేసి బ్యాగ్‌ను స్వాధీనం చేసుకుని, విద్యావతికి అప్పగించారు.