హైదరాబాద్ పాతబస్తీలోని బండ్లగూడలో పోలీసులు నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో విశాఖపట్నం నుంచి వస్తున్న కారులో 25 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. సౌత్ ఈస్ట్ డీసీపీ చైతన్యకుమార్ ఆదేశాల మేరకు ఈ తనిఖీలు జరిగాయి. కారు డ్రైవర్ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.