జనవరి నుంచి హైదరాబాద్‌ను తీవ్ర నీటి సంక్షోభం వెంటాడుతోంది. ఎల్ నినో ప్రభావంతో సింగూరు, మంజీరా జలాశయాల్లో నీటి మట్టాలు దారుణంగా పడిపోవడంతో 3.5 లక్షల నల్లా కనెక్షన్లకు నీటి కోత అనివార్యమైంది. హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బి రోజుకు 100 ఎంజీడీ నీటి సరఫరాను తగ్గించనుంది. బెంగళూరు తరహా కష్టాలు హైదరాబాద్‌కు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు.