హైదరాబాద్ సీపీ సజ్జనార్ మీమర్స్‌కు గట్టి హెచ్చరిక జారీ చేశారు. ఐబొమ్మ నిర్వాహకుడు రవి అరెస్టు అనంతరం పోలీసులపై వచ్చిన మీమ్స్‌ను ఆయన ప్రస్తావించారు. ఉచిత సినిమాల కోసం అక్రమ వెబ్సైట్లను ఆశ్రయించడం వల్ల కలిగే నష్టాలను వివరించారు. పోలీసులపై మీమ్స్ సృష్టిస్తే వారిపై నిఘా ఉంటుందని, మైనర్లతో వల్గర్ యాక్షన్స్ చేయించే వారిపై కేసులు పెడతామని ఆయన స్పష్టం చేశారు.