ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన టేస్ట్ అట్లాస్ ఇటీవల విడుదల చేసిన టాప్ 50 బెస్ట్ రైస్ డిషెస్ జాబితాలో హైదరాబాద్ బిర్యానీకి 10వ స్థానం లభించింది. భారతదేశం నుంచి ఈ జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక వంటకం ఇదే కావడం విశేషం. ఈ అరుదైన గుర్తింపుపై తెలుగు రాష్ట్రాల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.