గుడ్డు ఆరోగ్యానికి మంచిది, అనేక పోషకాలతో నిండి ఉంటుంది. అయితే, ఏ విధంగా వండితే ఎక్కువ పోషకాలు అందుతాయనే సందేహం చాలా మందిలో ఉంటుంది. అమెరికన్ కెమికల్ సొసైటీ చేసిన అధ్యయనం ప్రకారం, బాగా ఉడికించిన గుడ్డు లేదా ఆమ్లెట్ కంటే కొద్దిగా ఉడికించిన గుడ్డులో పోషకాలు అధికంగా ఉంటాయి. బాగా ఉడికించిన గుడ్డును జీర్ణం చేసుకోవడం కష్టం. విటమిన్ ఏ మాత్రం అన్ని రూపాలలోనూ సమానంగా ఉంటుంది.