పైనాపిల్ పండులో విటమిన్ సి, బి6, మాంగనీస్, పొటాషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. కానీ, దానిలోని బ్రోమెలిన్ ఎంజైమ్ వల్ల నాలుక పగిలినట్లు అనిపిస్తుంది. ఈ సమస్యను నివారించడానికి పైనాపిల్ ముక్కలపై ఉప్పు చల్లి తినవచ్చు లేదా వేయించి తినవచ్చు. పోషకాహార నిపుణులు రోజుకు ఒక కప్పు పైనాపిల్ తినమని సూచిస్తున్నారు.