గృహ ప్రవేశంలో గోమాత ఇంట్లోకి వస్తే శుభం కలుగుతుందని, దుష్టశక్తులు తొలగిపోతాయని హిందువులు విశ్వసిస్తారు. ఇటీవల, ప్లాస్టిక్ గోమాతతో గృహ ప్రవేశం చేస్తున్న వీడియో వైరల్గా మారింది. ఈ వీడియో సాంప్రదాయ ఆచారాలు, ఆధునిక పోకడల మధ్య చర్చకు దారితీసింది, గోమాత ఆచార ప్రాముఖ్యతపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.