తమిళనాడులోని శివగంగై సమీపంలో రెండు ప్రభుత్వ బస్సులు ఢీకొనడంతో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు, వీరిలో తొమ్మిది మంది మహిళలు ఉన్నారు. 40 మందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రులను శివగంగై ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.