అనంతపురం జిల్లా రాజంపేటలోని ఆంజనేయస్వామి ఆలయంలో ఒక అరుదైన సంఘటన చోటుచేసుకుంది. ఓ అజ్ఞాత వ్యక్తికి 1.39 క్యారెట్ల ముడి వజ్రం దొరికింది. ఆ వజ్రాన్ని అమ్ముకోకుండా, తన దగ్గర ఉంచుకోకుండా, ఆంజనేయస్వామి ఆలయ హుండీలో వేశాడు. భక్తి, నిజాయితీకి ఇది ఒక ఉదాహరణగా నిలుస్తోంది.