తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని అనంతపురం జిల్లా తిమ్మంపల్లిలో పోలీసులు అడ్డుకున్నారు. హైకోర్టు అనుమతి ఉన్నప్పటికీ, పోలీసులు ఆయనను మూడుసార్లు అడ్డుకున్నారు. తిమ్మంపల్లిలో వాహనాలు అడ్డుపెట్టి పెద్దారెడ్డిని తాడిపత్రి వెళ్ళకుండా ఆపారు. ఈ విషయంపై పెద్దారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.