హైదరాబాద్లో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్లు నిండాయి. గేట్లు ఎత్తి మూసీలోకి నీటిని విడుదల చేశారు. ఈ క్రమంలో ఉస్మాన్ సాగర్ వరదల్లో ఓ కారు ఘోషా మహల్ 100 ఫీట్ వద్దకు కొట్టుకువచ్చింది. ట్రాఫిక్ పోలీసులు కారును సురక్షితంగా బయటకు తీయగా, అదృష్టవశాత్తు కారులో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది.