ఏపీలో మహిళలు భారీ సంఖ్యలో పోస్టాఫీసులకు పోటెత్తారు. ప్రభుత్వం నెలకు రూ.1500 వేస్తుందని.. దీని కోసం పాస్టాఫీస్ బ్యాంక్‌లో ఖాతా తెరవాలని ప్రచారం జరిగింది. దీంతో వృద్ధులు, చిన్నారుల పేరిట అకౌంట్స్ ఓపన్ చేసేందుకు భారీ సంఖ్యలో మహిళలు పోస్టాఫీస్‌ల దగ్గరకు చేరుకున్నారు. అయితే దీనిపై అధికారులు కీలక ప్రకటన చేశారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి పథకం పైన అధికారిక ప్రకటన చేయలేదని స్పష్టంచేశారు. పుకార్లు నమ్మకూడదని అధికారులు సూచించారు. దీంతో ఏపీ మహిళలు కాస్త శాంతించి ఇంటికి వెళ్తున్నారు.