మార్కాపురం జిల్లా కాకర్ల గ్రామానికి చెందిన గుంటు లీలమ్మ గుండె సంబంధిత సమస్యతో బాధపడుతూ, తన ప్రాణాలకు ప్రమాదమని తెలిసినా బిడ్డకు జన్మనివ్వాలని నిర్ణయించుకుంది. అనేక ఆసుపత్రులు తిరిగినా ఫలితం లేకపోయింది. చివరికి, బిడ్డను రక్షించేందుకు తన ప్రాణాన్ని త్యాగం చేస్తూ, ఒక మగబిడ్డకు జన్మనిచ్చింది.