అధికంగా అన్నం తినడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం, రోజుకు మూడు పూటలా అన్నం తినడం వల్ల కడుపు ఉబ్బరం, అజీర్ణం, అధిక బరువు, డయాబెటిస్ వంటి సమస్యలు వస్తాయి. అందుకే, వైట్ రైస్‌కు బదులు బ్రౌన్ రైస్ లేదా రెడ్ రైస్ తినడం మంచిదని సూచిస్తున్నారు. మిల్లెట్స్, కూరగాయలు, లీన్ ప్రోటీన్లు ఎక్కువగా తీసుకోవడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది.