చిరుధాన్యాల్లో అత్యంత శక్తినిచ్చే పోషకాలున్న రాగుల వినియోగం ఇటీవల కాలంలో బాగా పెరిగింది. రోజు రాగి ముద్ద, రాగి జావ, రొట్టె ఇలా ఏది తిన్నా ఆరోగ్యానికి మంచిదే. రాగుల్లోని కాల్షియం ఎముకలను దృఢంగా మారుస్తుంది. దీనివల్ల వృద్ధాప్యంలో ఆస్టియోపోరోసిస్ వంటి ఎముకల సమస్యలు రావు.