పరగడుపున కొబ్బరి తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఆయుర్వేదం ప్రకారం, కొబ్బరిలోని ఫైబర్ జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది, గ్యాస్, మలబద్ధకం, యాసిడిటీని నివారిస్తుంది. ఇందులోని యాంటీవైరల్, యాంటీబాక్టీరియల్ గుణాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. కొబ్బరిలోని ఆరోగ్యకరమైన కొవ్వులు గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. అయితే, పరిమితంగానే తీసుకోవాలి.