రాత్రి నిద్రకు ముందు మజ్జిగ తాగడం ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. మజ్జిగలోని ప్రోబయోటిక్స్ జీర్ణశక్తిని మెరుగుపరుస్తాయి. క్యాలరీలు తక్కువగా ఉండటం వల్ల బరువు నియంత్రణకు సహాయపడుతుంది. అంతేకాకుండా, మజ్జిగలోని ప్రోటీన్, కాల్షియం అధిక ఆకలిని నియంత్రిస్తాయి. జీలకర్ర, నల్లమిరియాలతో కలిపి తీసుకుంటే మలబద్ధకం తగ్గుతుంది.