కిస్మిస్ లను వంటకాల్లో విరివిగా వాడుతూ ఉంటాం. ఈ ఎండు ద్రాక్ష పండ్లలో అనేక పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా తక్షణ శక్తిని ఇవ్వటం వీటి ప్రత్యేకత. వీటిలో అనేక రకాలు ఉండగా నలుపు రంగు కిస్మిస్ లు ఆరోగ్యానికి మంచివని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. 100 గ్రాముల నల్ల కిస్మిస్ తింటే 300 కేలరీల శక్తి లభిస్తుంది.