నలుపు రంగు ద్రాక్షలు తింటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. పోషకాహార నిపుణుల ప్రకారం.. వీటిలోని శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు అనేక వ్యాధుల నుండి మనల్ని రక్షిస్తాయి. రక్తపోటును నియంత్రించడంలో, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా ఇవి సహాయపడతాయి. ప్రతిరోజూ ఒక కప్పు నలుపు ద్రాక్షలు తినడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది.