అరటిపండ్లు తినడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో లాభాలున్నాయి. ఇవి తేలికగా దొరికే పండ్లు మాత్రమే కాదు.. పోషకాల నిధి కూడా. అరటిపండ్లలోని ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. పొటాషియం రక్తపోటును నియంత్రిస్తుంది. ఉదయం లేదా వ్యాయామం ముందు తినడం వల్ల శరీరానికి అవసరమైన శక్తి లభిస్తుంది.