వర్షాకాలంలో లభించే డ్రాగన్ ఫ్రూట్ అనేక పోషకాలతో నిండి ఉంటుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. మలబద్ధకం నివారణ, బరువు నియంత్రణ, షుగర్ లెవెల్స్ నియంత్రణలో డ్రాగన్ ఫ్రూట్ సహాయపడుతుంది. గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది.