జనగాం జిల్లా పాలకుర్తిలోని ఒక ప్రభుత్వ పాఠశాలను హెడ్మాస్టర్ శ్రీనివాస్ తమ సొంత ఖర్చుతో అద్భుతంగా అభివృద్ధి చేశారు. 40 మంది విద్యార్థులతో ఉన్న పాఠశాలలో ఇప్పుడు 94 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. బడిని అందంగా అలంకరించడం, మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం ద్వారా ఆయన ఈ మార్పును సాధించారు.