హనుమకొండ జిల్లా నేరేళ్లచాడలో రెండు కోతుల గుంపుల మధ్య భీకర ఘర్షణ స్థానికులను కలవరపెట్టింది. సినిమాల్లోని ఫైటింగ్లను తలపించిన ఈ గ్యాంగ్ వార్తో ప్రజలు భయపడుతున్నారు. కోతుల బెడద నుంచి తమను రక్షించాలని, ప్రభుత్వం తక్షణమే నిపుణులను నియమించాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు. అధికారులు ఈ విషయంలో అలసత్వం వహిస్తున్నారని ప్రజలు వాపోతున్నారు.