గుంటూరులో మహిళల భద్రతను పెంపొందించడానికి పోలీసులు అభయ ఆటో గుంటూరు యాప్‌ను ప్రారంభించారు. ఇటీవలి ఓ ఘటన నేపథ్యంలో ఎస్పీ వకుల్ జిందాల్ ఆలోచనతో ఇది అందుబాటులోకి వచ్చింది. ప్రయాణికులు ఆటోల్లోని క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి డ్రైవర్ వివరాలు తెలుసుకోవచ్చు, తమ ప్రయాణాన్ని పర్యవేక్షించవచ్చు. అనుమానం వస్తే ఎస్ఓఎస్ బటన్‌తో పోలీసులకు సమాచారం పంపవచ్చు.