గుంటూరు జిల్లా తెనాలిలో జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ గ్యాస్ ఏజెన్సీలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఓటీపీ లేకుండా డెలివరీలు, భద్రతా ప్రమాణాల ఉల్లంఘనలను ఆయన గుర్తించారు. నిబంధనలు పాటించని ఏజెన్సీలపై కఠిన చర్యలు, లైసెన్సుల రద్దు తప్పదని జేసీ హెచ్చరించారు. బ్లాక్ మార్కెటింగ్‌కు తావు లేకుండా చూసుకోవాలని వినియోగదారులకు సూచించారు.