జామపండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులోని విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, మెగ్నీషియం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. రక్తపోటును అదుపులో ఉంచుతుంది. చెడు కొలెస్ట్రాల్ తగ్గించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. బ్రెస్ట్ క్యాన్సర్ నిరోధక లక్షణాలను కూడా కలిగి ఉంటుంది. రోజూ ఒక జామపండు తినడం వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయి.