పల్లీలు పోషకాలతో నిండి ఉన్నప్పటికీ, కొందరిలో చర్మ సమస్యలకు దారితీయవచ్చు. ఇందులో ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉండటం వల్ల శరీరంలో వేడిని పెంచి, ముఖ్యంగా వేసవిలో ముద్దిములు, మంట, వాపు వంటి చర్మ సమస్యలకు కారణమవుతుంది. పల్లీల వల్ల చర్మం నూనెగా మారి, రోమరంధ్రాలు మూసుకుపోయే అవకాశం ఉంది. ప్రతి ఒక్కరి మీద ప్రభావం వేరుగా ఉంటుంది.