గుంటూరు జిల్లా నరసారావుపేటలో ప్రభుత్వ మహిళా ఉద్యోగినిపై జరిగిన అమానుష దాడి కలకలం రేపింది. మంచినీళ్ల సాకుతో ఇంట్లోకి ప్రవేశించిన నిందితుడు ఆమెను అత్యంత పాశవికంగా అత్యాచారం చేసి, ఇనుప చువ్వతో హింసించాడు. బాధితురాలు ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, పోలీసులు ప్రత్యేక బృందాలతో నిందితుడి కోసం గాలింపు చేపట్టారు.