Father's Unconditional Love: తండ్రి నిశబ్ద ప్రేమకు నిదర్శనంగా నిలిచిన గోరఖ్‌పూర్ ఘటన అందరినీ కలచివేసింది. టీచర్స్ కొడుతున్నారని కూతురు పాఠశాలకు వెళ్ళనని మారాం చేస్తే, తండ్రి ఆమెను తీసుకువెళ్లి టీచర్‌కు భావోద్వేగంతో విన్నవించుకున్నాడు. తన కూతురు తల్లిలేని బిడ్డని, దయచేసి అర్థం చేసుకోమని కన్నీళ్లతో అభ్యర్థించాడు. ఈ సంఘటన తండ్రుల త్యాగం, షరతులు లేని ప్రేమను చాటిచెప్పింది.