బంగారం, వెండి కొనుగోలుదారులకు శుభవార్త. పెళ్లిళ్ల సీజన్లో కిలో వెండి ధర ఏకంగా ₹5,000 తగ్గింది. బంగారం ధర కూడా ₹900 మేర దిగివచ్చింది. నవంబర్ 17న హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ₹1,35,350 వద్ద, 22 క్యారెట్ల బంగారం ధర ₹1,24,070 వద్ద ఉంది. మార్కెట్ హెచ్చుతగ్గుల కారణంగా నిపుణులు విడతల వారీగా కొనుగోలు చేయాలని సూచిస్తున్నారు.