ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాహనదారులకు గుడ్ న్యూస్ అందించింది. గ్రీన్ టాక్స్ భారాన్ని తగ్గిస్తూ ఆర్డినెన్స్ జారీ చేసింది. లారీలు, బస్సులపై విధించే గ్రీన్ టాక్స్‌ను రెండు స్లాబ్‌లలో (రూ.1500, రూ.3000) తగ్గించారు. 10 టన్నుల లారీలపై పన్ను రూ.5000 నుంచి రూ.1500కు, 30 టన్నుల లారీలపై రూ.15000 నుంచి రూ.3000కు తగ్గించారు.