నిజామాబాద్ జిల్లాలోని ప్రగతి ఆసుపత్రిలో దారుణం చోటుచేసుకుంది. గుండె నొప్పితో చేరిన గంగవ్వ మృతి చెందగా, ఆమె మృతదేహం నుంచి బంగారం మాయమైనట్లు బంధువులు ఆరోపించారు. ఆసుపత్రి సిబ్బందే బంగారాన్ని అపహరించారని ఆందోళన వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతురాలి బంధువులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.