బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ప్రస్తుతం పది గ్రాముల బంగారం ధర లక్ష పద్నాలుగు వేలకు పైగా ఉంది. వచ్చే ఏడాది రెండు లక్షలకు చేరుకుంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ట్రేడ్ వార్లు, ఆర్థిక అనిశ్చితి వంటి కారణాల వల్ల ఈ పెరుగుదల సంభవిస్తుందని చెబుతున్నారు. సామాన్యులకు బంగారం కొనుగోలు సాధ్యమేనా అన్నది ప్రశ్నార్థకంగా మారింది.