నిజామాబాద్‌లోని ప్రగతి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించిన గంగవ్వ అనే వృద్ధురాలి మృతదేహంపై నుంచి బంగారు ఆభరణాలు మాయమయ్యాయి. ఆసుపత్రి సిబ్బందిపై అనుమానం వ్యక్తం చేస్తూ కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు. సీసీ కెమెరాలు పనిచేయకపోవడం అనుమానాలకు తావిస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.