బంగారం ధరలు సాధారణ ప్రజలకు అంతుచిక్కడం లేదు. తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరుగుతున్నాయి. నవంబరు 28, శుక్రవారం నాడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.710 పెరిగి రూ.68,460కి చేరింది. అదేవిధంగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.650 పెరిగి రూ.62,750కి చేరుకుంది. కిలో వెండి ధర రూ.3,000 పెరిగి రూ.76,000 పలుకుతోంది.