ప్రపంచవ్యాప్తంగా పరిస్థితులు కుదుటపడటంతో డాలర్ పుంజుకోవడంతో బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. నవంబర్ 5న 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.980, 22 క్యారెట్లపై రూ.900 తగ్గింది. కిలో వెండిపై రూ.2000 తగ్గింది. నిపుణుల అంచనాల ప్రకారం, రానున్న రోజుల్లో ధరలు మరింత తగ్గే అవకాశం ఉంది.