మహారాష్ట్ర నాందేడ్‌లో సాక్షం, ఆంచల్ ప్రేమించుకున్నారు. కులాలు వేరు కావడంతో ఆంచల్ కుటుంబం సాక్షంను నవంబర్ 27న హత్య చేసింది. అంత్యక్రియల వద్దకు చేరిన ఆంచల్, ప్రియుడి మృతదేహాన్ని వివాహమాడి సింధూరం ధరించింది. మృతుడి తల్లి ఫిర్యాదుతో యువతి తల్లిదండ్రులు సహా ఎనిమిది మందిపై కేసు నమోదైంది. పోలీసులు నిందితులందరినీ వెంటనే అరెస్ట్ చేశారు.