ఒడిస్సా సరిహద్దులోని గంజాం జిల్లా పాత్రాపూర్లో 13, 15 అడుగుల భారీ కింగ్ కోబ్రాలు ఇళ్ల మధ్యకు వచ్చి స్థానికులను వణికించాయి. స్నేక్ హెల్ప్‌లైన్ బృందం పాములను పట్టుకునే ప్రయత్నంలో అవి బుసలు కొట్టడంతో జనం భయంతో పరుగులు తీశారు. అనంతరం రెండు భారీ కోబ్రాలను సురక్షితంగా సమీప అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు.