అనకాపల్లి జిల్లా దేవరాపల్లిలో 15 అడుగుల పొడవున్న భారీ గిరినాగు ప్రత్యక్షమై గ్రామస్తులను భయభ్రాంతులకు గురిచేసింది. పాము జనావాసాలలోకి ప్రవేశించడంతో ప్రజలు పరుగులు తీశారు. స్నేక్ క్యాచర్ సహాయంతో పామును సురక్షితంగా బంధించారు. తీవ్రమైన వేడిమి కారణంగా పాములు జనావాసాల వైపు వస్తున్నాయని గ్రామస్తులు అభిప్రాయపడుతున్నారు.