ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఏ వీధి చూసిన వినాయక మండపాల్లో ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. బొజ్జ గణపయ్య వివిధ రూపాల్లో దర్శనమిస్తున్నారు. రాజమండ్రి పుష్కరఘాట్ వద్ద పర్యావరణ హితం కోరుతూ 18 అడుగుల దూమ్ దూమ్ శంకర్ మహా గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా.