ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆగస్టు 15 నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించే స్కీమ్‌ను ప్రారంభించనుంది. "స్త్రీశక్తి" పథకం ద్వారా పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్, మెట్రో, సిటీ ఆర్డినరీ బస్సుల్లో ఉచిత ప్రయాణం లభిస్తుంది. అయితే, సూపర్ డీలక్స్, ఏసీ, గరుడ, అమరావతి వంటి ప్రీమియం బస్సులు, అంతర్రాష్ట్ర ప్రయాణాలకు ఈ పథకం వర్తించదు. ప్రయాణికులు గుర్తింపు కార్డు తప్పనిసరిగా చూపించాలి.