గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని వైద్య పరీక్షల నిమిత్తం హైకోర్టు ఆదేశాల మేరకు ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. జైలు అధికారులు ఆయనను ఆయుష్ ఆసుపత్రికి తరలించగా, హైకోర్టు ఆయన కుటుంబ సభ్యులకు ఆసుపత్రిలో ఉండేందుకు అనుమతి ఇచ్చింది. నకిలీ ఇల్లు పట్టాల కేసు మినహా మిగిలిన అన్ని కేసులలో వంశీకి బెయిల్ మంజూరు అయింది.