శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరగడం గుండె ఆరోగ్యానికి ప్రమాదకరం. 40 ఏళ్లు పైబడిన వారు కొన్ని రకాల ఆహారాలు తీసుకోవడం ద్వారా దీనికి చెక్ పెట్టవచ్చు. బీన్స్, నట్స్, సోయా ఉత్పత్తులు, యాపిల్, స్ట్రాబెర్రీ వంటి పండ్లు, సాల్మన్ వంటి చేపలు, బార్లీ వంటివి ఫైబర్, ప్రోటీన్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌తో కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి, గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి.