ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మన ఆహారం ద్వారా చర్మ సౌందర్యాన్ని సహజంగా పొందవచ్చు. వయసుతో పాటు చర్మం మృదుత్వం కోల్పోవడం, ముడతలు పడటం సమస్యలను కొల్లాజెన్ అధికంగా ఉన్న ఆహారాలు నివారించడంలో సహాయపడతాయి. మటన్ బోన్ సూప్, బెర్రీలు, ఆరెంజ్, ఉసిరికాయ, బ్రోకలీ, గుడ్లలోని తెల్లసొన, బాదం, మరియు వివిధ గింజలు వంటి ఆహారాలు చర్మాన్ని యవ్వనంగా ఉంచడంలో సహాయపడతాయి.