తిరుపతిలోని పెద పీర్ల చావిడి ప్రాంతంలో ఆహార భద్రతా అధికారులు నిర్వహించిన దాడుల్లో షాకింగ్ విషయాలు వెలుగుచూశాయి. 15 మటన్ దుకాణాలలో నెలల తరబడి నిల్వ ఉంచిన, కుళ్ళిపోయిన 1000 కేజీల మాంసాన్ని సీజ్ చేశారు. ఈ పాడైన మాంసాన్ని రెస్టారెంట్లు, రోడ్డు పక్కన దుకాణాలకు సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు, ఇది వినియోగదారుల ఆరోగ్యానికి తీవ్ర ముప్పుగా పరిణమించింది.