ఢిల్లీలోని తీస్ హజారి కోర్టులో షికా సింగ్, సౌరభ్ దంపతుల ఐదేళ్ల విడాకుల కేసు భావోద్వేగంగా ముగిసింది. తండ్రి గుండెపోటుతో ఆసుపత్రిలో చేరగా, అల్లుడు సౌరభ్ మానవత్వంతో చికిత్సకు సహాయం చేశారు. ఈ ఘటనతో మనసు మారిన షికా, విడాకుల పత్రాలను చించివేసి భర్తను హత్తుకుంది. కుటుంబ బంధాల విలువను చాటిచెప్పిన ఈ సంఘటన అందరినీ కదిలించింది.