చింతపల్లిలో భారీ వర్షంలో అనారోగ్యానికి గురైన తన ఎనిమిదేళ్ల కూతుర్ని నాలుగు కిలోమీటర్లు మోసుకెళ్లిన ఓ తండ్రి సాహసం ప్రశంసలు అందుకుంటోంది. తాడిబంద నుంచి బజ్జంత వరకు కూతుర్ని మోసుకెళ్లిన తండ్రి ఆ తర్వాత ఆటోలో దౌలూరు పీహెచ్సీకి, అక్కడి నుంచి నర్సీపట్నం ఆసుపత్రికి తరలించాడు.